విపక్షాల భారీ ఐక్య ర్యాలీకి పశ్చిమ బెంగాల్‌లోని బ్రిగేడ్ పరేడ్ మైదానం ముస్తాబైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పలు పార్టీల నేతలు హాజరవుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ సహా సుమారు 20 మంది జాతీయస్థాయి నేతలు విచ్చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ-బీఎస్పీ కూటమి నేతలతో పాటూ వారు దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొంటుండటం విశేషం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో- పలు భాజపాయేతర పక్షాలు ఒకే వేదికను పంచుకోనుండటం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ఇదో ముందడుగని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment