Showing posts with label News Telugu. Show all posts
Showing posts with label News Telugu. Show all posts

Monday, February 18, 2019

వైఎస్‌ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ

టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి..
అమలాపురం టీడీపీ ఎంపీ పి. రవీంద్రబాబు సోమవారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుతో పాటు వైఎస్‌ జగన్‌తో ఆయన భేటీ అయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అమలాపురం ఎంపీ టిక్కెట్‌పై మరోసారి భరోసా ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

సత్యమే గెలిచింది..ఆర్’జివి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఏకకాలంలో బయోపిక్‌లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏదంటూ వర్మ ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లలో ఏది నిజాయితీతో, యధార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మపెట్టిన పోల్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్‌కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్‌ రిజల్ట్‌ను పోస్ట్‌ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్‌ అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.

కథా నాయకుడు రిలీజ్ తర్వాత… అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌ జీవితంలోని ‘అతి ముఖ్యమైన ఆ భాగం’ చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానులనుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘మహానాయకుడు’ వెన్నుపోటు’ ఎపిసోడ్‌ని మేనేజ్‌ చేసి వుంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.


ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడికి ఇతడే వ్యూహరచన చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఐఈడీ బాంబుల అమరికలో నిపుణుడైన ఘాజీ, పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దార్‌కు శిక్షణ ఇచ్చాడు. అఫ్ఘనిస్తాన్ యుద్ధంలోనూ పాల్గొన్న ఘాజీ, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత నమ్మకస్తుడు. అతడికి కుడి భుజం లాంటి రషీద్, యుద్ధ నైపుణ్యాలు, ఐఈడీ బాంబుల తయారీలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటాడు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

పుల్వామాలోని పింగ్లన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు.

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌లో అది పచ్చి అబద్దం.. అసలు నిజం ఇదే – రామ్ గోపాల్ వర్మ



 

వైసీపీలోకి అమలాపురం టీడీపీ ఎంపీ.. రెండ్రోజుల్లో జగన్‌తో భేటీ?

ఎన్నికల వేళ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వైకాపాలో చేరుతుండటం టీడీపీలో కలవరం రేపుతోంది. ఈ కోవలోనే మరోవార్త ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కోనసీమ ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు(టీడీపీ) ప్రతిపక్ష పార్టీ వైకాపా వైపు చూస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని, చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని ఇటీవలే ఆయన వ్యాఖ్యానించారు.

అయితే కొద్దికాలంగా వైకాపా వర్గాలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే యోచన లేదని పైకి చెబుతున్నా రవీంద్రబాబు మాత్రం వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన నేడో, రేపో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జన్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అధికార పార్టీని వీడి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే అమలాపురం ఎంపీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కానున్నారన్న వార్త టీడీపీలో కలకలం రేపుతోంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన పందుల రవీంద్రబాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో అమలాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

జనసేన టిక్కెట్ల కోసం క్యూ.. భారీగా దరఖాస్తులు!

వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశంపై భారీ కసరత్తు చేస్తోంది. దీని కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన జనసేన, పోటీచేయాలనుకునే ఆశావాహులు పూర్తి వివరాలతో కూడిన తమ బయోడేటాను పంపించాలని సూచించారు. దరఖాస్తుదారుల్లో పోటీకి అర్హులైన వారిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆదివారం ఒక్కరోజే 45 మంది మహిళలు సహా 210 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీని కలిసి తమ బయోడేటాను అందజేశారు.

తమలో ఒకరికి టికెట్‌ కేటాయించాలంటూ 8 మంది దంపతులు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. వివిధ రంగాలకు చెందిన వారితోపాటు వృత్తి నిపుణులు, ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు 200 దరఖాస్తులు, శుక్రవారం 350 దరఖాస్తుల వరకు వచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్క్రీనింగ్ కమిటీకి పలు సూచనలు చేసింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చిన పవన్, నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Saturday, February 16, 2019

భీష్మ ఏకాదశి విశిష్టత

భీష్ముడు :


గంగా, శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు “దేవవ్రతుడు”. వార్ధక్యదశలో శంతనుడు, సత్యవతి సౌందర్యానికి దాసుడై, మన్మథవశవర్తియై, విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే, ఈ సంగతి తెలిసిన “దేవవ్రతుడు” తన తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, “నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు” అని సత్యవతికి వాగ్దత్తం చేసి, అం అరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన “భీష్ము”డయ్యాడు. కుమారుని త్యాగనిష్ఠకు సంతసించిన శంతనుడు, భీష్మునకు స్వచ్చంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు.

పితామహుని ప్రతాపం :


కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మపరులను సమిథులుగా, అవినీతి వర్తనులను హవిస్సుగా, అరివీరుల హాహాకారాల “స్వాహా”కారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వ యజ్ఞాన్ని … ఒంటిచేత్తో పదిరోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు “భీష్ముడు”. భీష్మ ధనుర్విముక్త నిశిత శరాఘాతాలకు, పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్ధుడే కాదు, పార్శసారథికూడా నిశ్చేష్టుడయ్యాడు. “ఆహావరంగంలో ఆయుధం పట్టను” అని పల్కిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మసంహారానికి ఆయుధం పట్టాడు. పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు “భీష్ముడు”.


శరతల్పం :



తన నెరిసి, చూపు మందగించి, జవసత్త్వాల పట్టు తప్పి, వార్ధక్యవార్షికి అవ్వాలితీరాన వున్నా భీష్ముడు … పున్సత్వం నశించిన పానడవులు, శిఖండిని ముందునుంచుకుని పోరుకు తలబడితే, తాను శిఖండి కాలేక అస్త్రసన్యాసం చేసి, గాండీవ ధనుర్విముక్త శరసహశ్రానికి శరతల్పగతుడయ్యాడు. అంతమాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు. అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే “భీష్ముడు” మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అమ్ములు ములుకుల్లా బాధిస్తున్నా, సహిస్తూ, ఆ యుద్ధరంగంలో పీనుగుల గుట్టల మధ్య, క్షతగాత్రుల రోదనలు వింటూ, నక్కల, తోడేళ్ళ, రాబందుల, గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణవేదనను అనుభవిస్తూ, మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు విజయలక్షిని వరించాడు. స్వజనుల రక్తతిలకంతో, అయినవాళ్ళ అశ్రుజలధారలతో హస్తిన సింహపీఠంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యానే …, అన్న బాధతో ధర్మజుడు, సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు. వెంటనే శ్రీకృష్ణునితో కలిసి, తన సోదరులను వెంటబెట్టుకుని శరతల్పగతుడైన ఆ “శాంతనవుని” దగ్గరకు వచ్చాడు.


మహాప్రస్థానం :



ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు, ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి, అలసటతో వాలివున్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూసాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు. మనరానికి చివరిమెట్టు మీదవున్న అంతిమక్షన్నంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించాడు. పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, “పితామహా! సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటేగానీ, మానసిక విజయాన్ని వరించలేకపోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు. ఈ విశ్వంలో గొప్పదైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖసంతోషాలు లభిస్తాయి. ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణుకోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది?” అని ప్రశ్నించాడు.



భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి … తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, “ధర్మజా! నీ సందేహాలన్నింటికీ నా చివరి సమాధానం, లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే” అంటూ చేతులు జోడించి, “జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం” అంటూ ప్రారంభించి, “విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:” అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ “ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ “గాంగేయా! నీ భక్తిపారవశ్యం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణదినంగా నీకు కానుక యిస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి” అని పలికాడు. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది.



భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన “విష్ణుసహస్రనామస్తోత్రం” యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం.


అశ్రుతర్పణం :


భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని “భీష్మాష్టమి”గాను, మాఘశుద్ధ ఏకాదశిని “భీష్మఏకాదశి”గాను మానవాళి స్మరించడమే, మనం ఆ పితామహునకు యిచ్చే అశ్రుతర్పణాలు. భారతజాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి, మత, కులభేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మఏకాదశి పర్వదినంనాడు తిలాంజలులు సమర్పించాలి.


        “వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్యప్రవరాయచ   
        గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
        అపుత్రాయ జాలందద్మి నమో భీష్మాయ వర్మణే
        భీషశ్శాంతనవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
        ఆభిరర్బివాప్నోటు పుత్రపౌత్రో చితాం క్రియమ్ ”


అని ధర్మసింధువు చెబుతూంది. అంటే, “వ్యాఘ్రపాద గోత్రమునందు జన్మించినవాడు, సాంకృత్యప్రవరుడు, గంగాపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపుత్రకుడు అయిన భీష్మునకు తర్పణములు యిచ్చుచున్నాను. ఈ తర్పణములతో శాంతనపుత్రుడు, వీరుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్రపౌత్రక్రియలవలె తృప్తినొందుగాక” అను అర్థముగల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతము వెసుకుఇ, తర్పణమిచ్చి, ఆచమనము చేసి, సవ్యముగా యజ్ఞోపవీతము వేసుకుని ఈ క్రింది శ్లోకముతో ఆర్ఘ్యము యివ్వాలి.



        “వసూనామవతారాయ శంతనోరాత్మజయచ
        ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల్య బ్రహ్మచారిణే”



“అష్టవసువులకు ఎకావతారమగు శంతను పుత్రుడైన భీష్మునకు ఆర్ఘ్యం యిచ్చుచున్నాను” అని అర్థం.
శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారే తర్పణాలు యివ్వడానికి అర్హులు. కానీ, భీష్మునికి తర్పణాలు యిచ్చే విషయంలో తండ్రి జీవించివున్నా వారు కూడా తర్పణాలు యివ్వవచ్చునని ఋషులు సమ్మతించారు. అయితే జీవత్సతృకులు తర్పణాలు యిచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బొటనవ్రేలికి చుట్టుకుని తర్పణాలు యివ్వాలి. బీష్మునికి తర్పణాలు యిస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు … “సంతానం లేని దంపతులు “భీష్మాష్టమినాడు” కానీ “భీష్మఏకాదశి” నాడు గానీ, భీష్మునికి శ్రాద్ధము (తద్దినం) పెడితే వారికి సత్ సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం.
కనుక, ఈ భీష్మఎకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.

Tuesday, February 12, 2019

రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలి?

మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి. దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ ప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము. స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ ఓగోవింద, అచ్యుత, మాధవ, మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి.

సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ త్వత్తేజపా పరిభష్టం పాపంయాతు సహస్రధా ఓ సూర్యభగవాన్! నీ తేజస్సుచేత నాపాపం వేయి విధాలుగా చీలిపోవుగాక. రథసప్తమినాడు: యద్యత్ జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మేరోగం చ సోకం మాకరీ హంతు సప్తమీ ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పువ: ఇతి స్ప్తవిధం పాపం స్నానాన్మే స్ప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ఓ మకరరాశిలో ఉన్న సప్తమి! ఈ జన్మలో ఏదుజన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టు రోగాన్ని శోకాని లేకుండా చేయి. తెలిసి తెలీయక చేసిన పాపాన్ని మనస్సు వాక్కు శరీరం ద్వారా చేస్తున్న పాపాలను పోగొట్టును. ఆనాడు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, పండ్లు, నెత్తిమీద పెట్తుకొని స్నానం చేయడం ఆచారం. ఆపైన సూర్యునికి ఆర్ఘ్యం (దోసిలితో నీళ్ళు వదలుట) ఇవ్వాలి. సప్త సప్తి మహాప్రీతి సప్తలోకప్రదీవన సప్తమీ సహితోదేవ, గృహాణార్ఘ్యం దివాకర ఏడులోకాలకు కాంతినిచ్చే సూర్యదేవ స్ప్తమితిథితో కూడుకున్నవాడా ఈ ఆర్ఘ్యాన్ని తీసుకో. ఆపైన సూర్యునికి ఈ శ్లోకాన్ని చెబుతూ నమస్కరించాలి. జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి, నమస్తే సూర్యమండల సూర్యమండలంలో ఉండే ఓ సవితృదేవత! అన్ని లోకాలకు తల్లివి నీవు. భూ: భువ: సువ: మొదలగు వ్యాహృతులతో కూడి యున్నదానవు. నీకు నమస్కారము.

Thursday, January 17, 2019

50 కోట్లు కొల్లగొట్టారు



  సంక్రాంతి బరిలో ఒక మాములు ఫామిలీ సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీసునీ షాక్ చేస్తోంది. ఎంతో హంగులు భారీ బుడ్జె సినిమాల మధ్య ఏకగ్రీవంగా విజయం సాధించి. సంక్రాంతి రేసులో విన్నర్ గ నిలిచింది. వచ్చే ఆదివారం వరకు ఈ జోరు తగ్గదని ఖచ్చితమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యాభై కోట్ల షేర్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇద్దరు హీరోల ఖాతాలో ఇది రెండవ యాభై కోట్ల చిత్రమవుతుంది. ఇంతకుముందు వరుణ్‌ తేజ్‌ చిత్రం ‘ఫిదా’ యాభై కోట్లకి పైగా షేర్‌ సాధించింది. వెంకటేష్‌కి మహేష్‌తో కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో యాభై కోట్ల క్లబ్‌లో స్థానం దక్కింది. 
ఇప్పుడీ ఇద్దరు హీరోలకీ మరో యాభై కోట్ల సినిమా ఖాయమైంది. విశేషమేమిటంటే వీరికి ఇంత పెద్ద విజయాలని అందించిన ఈ మూడు చిత్రాలని దిల్‌ రాజే నిర్మించడం విశేషం. ఎఫ్‌2తో అనిల్‌ రావిపూడి ఖాతాలో కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ వచ్చింది. ఇంతకుముందు అతని సినిమాలు ముప్పయ్‌ కోట్ల లోపే వసూలు చేసాయి. మొదటి సారి పూర్తిస్థాయి ఫ్యామిలీ సినిమా తీసిన అనిల్‌ రావిపూడికి ఇటు ఇక్కడ ఘన విజయంతో పాటు ఓవర్సీస్‌లో కూడా తొలి మిలియన్‌ డాలర్‌ సినిమా వచ్చింది.