- తేనెలో ఎండు ఖర్జూరాలను వారంపాటు నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.
- మెమొరీ పవర్ పెరగడంతోపాటు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- రక్త హీనత ఉన్నవారికి ప్రయోజనకరం.
ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చిన్న కంటైనర్‌లో మూడొంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. వీటిని తేనెలో బాగా కలిపి మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకట్రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినొచ్చు. తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జబ్బుల బారిన పడటం తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి. మెమొరీ పవర్ పెరుగుతుంది. చిన్నారులు చదువుల్లో చురుగ్గా మారతారు.
తేనె, ఖర్జూర మిశ్రమంలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ మిశ్రమం రక్త హీనతను తగ్గించి, ఎముకలను బలంగా మారుస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
మలబద్ధకంతో బాధపడే వారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా సరిగా జరిగేలా మెరుగు పరుస్తుంది.
Health Benefits of Dates Soaked in Honey| Health Tips In Telugu | ManaAksharam
For more health tips
Follow Us On YouTube And Subscribe Here :
https://goo.gl/TtnhG8
Follow Us On YouTube And Subscribe Here : https://goo.gl/TtnhG8 Follow Us On Facebook : https://www.facebook.com/ManaAksharam. Follow Us On Twitter : https://twitter.com/manaaksharam/
No comments:
Post a Comment