Monday, February 18, 2019

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.


ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడికి ఇతడే వ్యూహరచన చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఐఈడీ బాంబుల అమరికలో నిపుణుడైన ఘాజీ, పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దార్‌కు శిక్షణ ఇచ్చాడు. అఫ్ఘనిస్తాన్ యుద్ధంలోనూ పాల్గొన్న ఘాజీ, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత నమ్మకస్తుడు. అతడికి కుడి భుజం లాంటి రషీద్, యుద్ధ నైపుణ్యాలు, ఐఈడీ బాంబుల తయారీలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటాడు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

పుల్వామాలోని పింగ్లన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు.

No comments:

Post a Comment