కేసీఆర్ :
కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
మంచు మోహన్ బాబు :
నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామకృష్ణ గారి మరణం బాధాకరం. తెలుగు సినిమా ఓ మంచి దర్శకున్ని కోల్పోయింది. తెరపై ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి దర్శకుడు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరనిలోటు. ఆయనతో నేను కూడా కొన్ని సినిమాలకు పని చేసే గౌరవం దక్కింది. శ్రీ కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మహేష్ బాబు :
ఆయన మరణం చాలా బాధాకరం. ఆయన తెలుగు సినిమాకు చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
జూ.ఎన్టీఆర్ :
తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది మిమ్మల్ని మిస్ అవుతున్నాము.
కళ్యాణ్ రామ్ :
చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
రానా :
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
నాని :
ఆయన తరంలో ఆయన కూలెస్ట్. ఓ లెజెండ్‌ను కోల్పోయాం. మీరెప్పటికీ గుర్తుంటారు సర్.
సాయి ధరమ్ తేజ్ :
ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
శ్రీనువైట్ల :
ఆయన మరణం ఎంతో బాధాకరం. అంకితభావం కలిగిన దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది.
దేవీ శ్రీ ప్రసాద్ :
మహోన్నత వ్యక్తిని కోల్పోయాను. నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. చిత్రసీమ గొప్పదర్శకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
అనిల్ రావిపూడి :
నాలాంటి ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. ఆయన మరణవార్త విని షాక్‌కు గురయ్యాను.
మెహర్ రమేష్ :
హీరోలను, విలన్లను, విజువల్ ఎఫెక్ట్స్‌ను, భక్తిరస చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది.
బ్రహ్మాజి :
నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారికి నమస్కారాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
No comments:
Post a Comment