Saturday, February 16, 2019

Real Hero : Vijay Devarakonda

 

తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు విజయ్ దేవరకొండ. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ అతితక్కువ కాలంలోనే స్టార్ హోదా సాధించుకున్నాడు. వారసులకే సాధ్యం కాని విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే తాను రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే అని మళ్లీ నిరూపించుకున్నాడు విజయ్. ఎవరికి ఏం సాయం వచ్చినా నేనున్నానంటూ ముందుండే విజయ్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన విజయ్ అందరి హీరోల్లా ట్వీట్ చేసి ఊరుకోలేదు. జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేసి ఆ సర్టిఫికెట్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.



‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. ఈ కష్టకాలంలో మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారికి మనం మనవంతు సహకారం అందించాలి. అందుకే నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద మద్దతు క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేసిన విజయ్ అందరి మనసులు గెలుచుకున్నాడు. విజయ్ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సైనికులకు సాయం ఎలా చేయాలో మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment