సంక్రాంతి బరిలో ఒక మాములు ఫామిలీ సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీసునీ షాక్ చేస్తోంది. ఎంతో హంగులు భారీ బుడ్జె సినిమాల మధ్య ఏకగ్రీవంగా విజయం సాధించి. సంక్రాంతి రేసులో విన్నర్ గ నిలిచింది. వచ్చే ఆదివారం వరకు ఈ జోరు తగ్గదని ఖచ్చితమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యాభై కోట్ల షేర్ సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇద్దరు హీరోల ఖాతాలో ఇది రెండవ యాభై కోట్ల చిత్రమవుతుంది. ఇంతకుముందు వరుణ్ తేజ్ చిత్రం ‘ఫిదా’ యాభై కోట్లకి పైగా షేర్ సాధించింది. వెంకటేష్‌కి మహేష్‌తో కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో యాభై కోట్ల క్లబ్‌లో స్థానం దక్కింది.
ఇప్పుడీ ఇద్దరు హీరోలకీ మరో యాభై కోట్ల సినిమా ఖాయమైంది. విశేషమేమిటంటే వీరికి ఇంత పెద్ద విజయాలని అందించిన ఈ మూడు చిత్రాలని దిల్ రాజే నిర్మించడం విశేషం. ఎఫ్2తో అనిల్ రావిపూడి ఖాతాలో కూడా బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. ఇంతకుముందు అతని సినిమాలు ముప్పయ్ కోట్ల లోపే వసూలు చేసాయి. మొదటి సారి పూర్తిస్థాయి ఫ్యామిలీ సినిమా తీసిన అనిల్ రావిపూడికి ఇటు ఇక్కడ ఘన విజయంతో పాటు ఓవర్సీస్‌లో కూడా తొలి మిలియన్ డాలర్ సినిమా వచ్చింది.
No comments:
Post a Comment